logo

ఆరు నెలలు.. నాలుగు ప్రయోగాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకొని ఆ దిశగా బిజీబిజీ షెడ్యూల్‌ రూపొందించుకుంది.

Updated : 04 Jul 2024 05:18 IST

ఇస్రో తీరికలేని షెడ్యూల్‌

శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకొని ఆ దిశగా బిజీబిజీ షెడ్యూల్‌ రూపొందించుకుంది.

  • అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా), నిసార్‌(నాసా, ఇస్రో సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌) రెండు దేశాల సంయుక్త ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. దీనిని రానున్న రెండు నెలల్లో చేసేలా యత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రయోగం మార్చిలో చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఉపగ్రహంలోని కొంతభాగాన్ని డిప్లోయబుల్‌ యాంటెన్నా చిన్న మార్పుల కోసం నాసాకు చెందిన జెట్‌ ప్రొపెల్షన్‌ లాబోరేటరీకి తిరిగి పంపారు. ఉపగ్రహంలోని డిప్లోయబుల్‌ యాంటెన్నా యూఎస్‌ కంపెనీ సరఫరా చేసింది. అందులోని కొన్ని దిద్దుబాట్లను వారే చేయాల్సి రావడంతో అక్కడకు పంపారు. ఇది జులై 10లోగా బెంగళూరుకు చేరనుంది. యాంటెన్నా వచ్చిన తర్వాత దానిని ఉపగ్రహంతో అనుసంధానం చేసి, వివిధ పరీక్షలు నిర్వహించి, శ్రీహరికోటకు తీసుకువస్తారు.
  • భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న గగన్‌యాన్‌ యాత్రకు సంబంధించిన మూడు ప్రయోగాత్మక పరీక్షలు ఈ ఆరు నెలల్లోనే చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో సన్నాహకంగా ఒక టెస్ట్‌ ఫ్లైట్, ప్యాడ్‌ అబార్ట్‌ టెస్ట్, మానవ రహిత మిషన్‌ చేపట్టనున్నారు.
  • అలాగే ఏడాది చివరలోగా స్పేస్‌ డాకింగ్‌ ప్రయోగం లేదా స్పాడెక్స్‌ చేపట్టనున్నారు.
  • గతంలో జీశాట్‌-20గా పిలిచే జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహాన్ని ఆగస్టులో స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 లాంచర్‌లో కక్ష్యలోకి పంపనున్నారు. జీశాట్‌-ఎన్‌2 ద్వారా దేశ వ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు, ఇన్‌-ఫ్లైట్‌ కనెక్టివిటీని మెరుగుపరచడానికి తక్కువ ధర కాగా బ్యాండ్‌ అధిక నిర్గమాంశ ఉపగ్రహాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని