logo

భక్తులకేదీ ఉపశమనం

శ్రీవారి భక్తుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజంకు హోటళ్లు, జనతా క్యాంటీన్‌ను కేటాయించగా వాటిలో భారీగా ధరలు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 04 Jul 2024 03:26 IST

తిరుమలలో తీరుమారని ఏపీ టూరిజం సంస్థ
తితిదే ఆస్తులు అప్పగించినా అధిక ధరలు
నిర్దేశిత ధరల అమలుపై ఆశలు

శ్రీవారి భక్తుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజంకు హోటళ్లు, జనతా క్యాంటీన్‌ను కేటాయించగా వాటిలో భారీగా ధరలు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తితిదే తన ఆదాయం సైతం వదులుకుని ఆస్తులు అప్పగిస్తే టూరిజం సంస్థ చేసే నిర్వాకం ఇదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

న్యూస్‌టుడే, తిరుమల  

రూ.3.80 కోట్ల సంతర్పణ: నారాయణగిరి హోటల్‌ను ఏపీ టూరిజంకు ఇవ్వడంతోపాటు ఆ భవనం ఆధునికీకరణ, మూడో అంతస్తు గదుల నిర్మాణం కోసం తితిదే రూ.3.80 కోట్లు విడుదల చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులతో ఏపీ టూరిజానికి ఇచ్చే భవనాన్ని ఆధునికీకరించి అదనపు గదులు నిర్మిస్తున్నారు. తితిదే నిధులతో ఏపీ టూరిజం హోటల్‌ను ఆధునికీకరించడంతోపాటు రూ.5 లక్షల నామమాత్రపు అద్దెకు ఇస్తే వారు మాత్రం దోపిడీ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు.  ఏపీ టూరిజంకు ఇస్తే వారు ఆధునికీకరించుకోవాలిగానీ తితిదే నిధులు ఖర్చుపెట్టి నిర్మాణం చేసి ఇవ్వడం ఎంతవరకు సబబనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే హోటల్‌కు గతంలో నెలకు రూ.60 లక్షల అద్దె చెల్లించేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చారు. కరోనా నేపథ్యంలో 2021లో మూతపడిన ఈ హోటల్‌ను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

తితిదే ఇలా చేస్తే మేలు..

  • రూ.కోట్ల ఆదాయాన్ని తితిదే వదులుకుని టూరిజం సంస్థకు అప్పగించిన నేపథ్యంలో వీటి ప్రాంగణాల పరిధిలో సేవాభావం కనిపించేలా చూడాలి.
  • భక్తులపై ధరాభారం మోపకుండా నిర్దేశిత ధరలు, మెనూ నాణ్యంగా అమలు చేసేలా తితిదేతోపాటు టూరిజం సంస్థ ఉన్నతాధికారులు కలిసి నిర్ణయం తీసుకోవాలి.
  • ఫలహారం, చిరుతిళ్లు వంటి వాటికి క్షేత్ర పరిధిలో అధిక మొత్తం వసూలు చేస్తున్న నేపథ్యంలో వాటిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 
  • స్పెషల్‌ పేరుతో భక్తుల జేబుకు చిల్లు 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని