logo

తోతాపురి కాయల కొనుగోలు నిలిపివేత

తోతాపురి మామిడిని సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కాయల కొనుగోలు నిలిపివేశామని పరిశ్రమల వద్ద నోటీసులు అతికిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాత పడిపోయారు.

Published : 04 Jul 2024 03:20 IST

నోటీసులు అంటిస్తున్న గుజ్జుపరిశ్రమల నిర్వాహకులు

 మామిడి కాయల లోడుతో వేచి ఉన్న ట్రాక్టర్లు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: తోతాపురి మామిడిని సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కాయల కొనుగోలు నిలిపివేశామని పరిశ్రమల వద్ద నోటీసులు అతికిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాత పడిపోయారు. కోతలు కోసి కాయలను పరిశ్రమల వద్దకు తీసుకెళ్లినా కొనడం నిలిపివేశామని తిప్పి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో తోటల్లో ఉన్న వెయ్యి టన్నులకుపైగా పంటను ఎలా అమ్ముకోవాలంటూ రైతులు మథనపడుతున్నారు. కలెక్టరు సుమిత్‌కుమార్‌ ఈ నెల 1 నుంచి 3వ తేది వరకు పండ్లగుజ్జు పరిశ్రమలకు కాయలను తరలించిన రైతులకు టన్ను రూ.24 వేలు చెల్లించాలని నిర్ణయించిన విషయం విదితమే. కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాలోని రైతులు పంటను పండ్లగుజ్జు పరిశ్రమల వద్దకు తీసుకెళ్లారు. అంచనాలకు మించి కాయలు రావడంతో తోతాపురి కాయల కొనుగోలు నిలిపివేసినట్లు  నిర్వాహకులు నోటీసులు అతికించారు. మరికొందరు తోతాపురి టన్ను రూ.20 వేల ధరకు దింపుకొంటామని చెప్పారని రైతులు అంటున్నారు. బంగారుపాళ్యంలోని ర్యాంపు వ్యాపారులు టన్ను రూ.19 వేలకు కొనుగోలు చేస్తున్నారు.   
రైతుల ఆందోళన.. జీడీనెల్లూరు, న్యూస్‌టుడే: మామిడికి గిట్టుబాటు ధర కావాలని రైతులు బుధవారం స్థానిక మామిడిగుజ్జు పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. టన్నుకు కేవలం రూ.20 వేలు మాత్రం ఇవ్వడం వల్ల దారుణంగా నష్టపోతున్నామని వాపోయారు.  యాజమానులతో మాట్లాడి న్యాయం చేస్తామని కర్మాగార ప్రతినిధులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని