logo

వైకాపా ఎంపీపీ సవాల్‌ నిలబెట్టుకోవాలి

వైకాపా ఎంపీపీ యువరాజ్‌ ఎన్నికల ముందు విసిరిన సవాల్‌ ప్రకారం పదవికి రాజీనామా చేసి, రూ. 20 కోట్ల ఆస్తి ఇచ్చేసి మాటనిలబెట్టుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 04 Jul 2024 02:43 IST

నిరసన వ్యక్తం చేసిన తెదేపా నాయకులు
బిల్లులు స్వాహా చేశాడని వైకాపా సర్పంచి ఆరోపణ

ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు

వి.కోట, న్యూస్‌టుడే: వైకాపా ఎంపీపీ యువరాజ్‌ ఎన్నికల ముందు విసిరిన సవాల్‌ ప్రకారం పదవికి రాజీనామా చేసి, రూ. 20 కోట్ల ఆస్తి ఇచ్చేసి మాటనిలబెట్టుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. తెదేపా అధికారం చేపట్టిన తర్వాత స్థానిక ఎంపీపీ ఎంపీడీవో కార్యాలయానికి రాలేదు. బుధవారం వస్తున్నారన్న సమాచారంతో తెదేపా మండలాధ్యకుడు రంగనాథ్‌ నేతృత్వంలో శ్రేణులు అక్కడికి తరలి వచ్చారు. ఎంత సేపటికి అతను రాకపోవడంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మండల పార్టీ అధ్యకుడు, మాజీ ఎంపీపీ స్వగ్రామం కుంభార్లపల్లె పంచాయతీలో తెదేపాకు వైకాపా కంటే ఒక్క ఓటు ఆధిక్యం వచ్చినా పదవికి రాజీనామా చేసి.. తన ఆస్తినంతా ఇచ్చేస్తానని వైకాపా ఎంపీపీ యువరాజ్‌ విసిరిన సవాల్‌ను గుర్తు చేశారు. తర్వాత కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల వినతిపత్రాన్ని ఎంపీˆడీవోకు అందించారు. రాంబాబు, ధీరజ్, ఈశ్వర్‌గౌడు, విశ్వనాథ్, నాగరాజు పాల్గొన్నారు.

నిధులు మళ్లించారని ఆరోపణ

ఎంపీపీ యువరాజ్‌ తాను పనిచేసిన బిల్లులను ఆయన ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ముదరందొడ్డి వైకాపా సర్పంచి దామోదర్‌ ఆరోపించారు. గ్రామంలో మండల పరిషత్‌ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించానని ఇందుకు సంబంధించిన రూ.13 లక్షల నిధులు రావాల్సి ఉందని ఎంపీడీవోను ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ విషయమై తనకు మద్దతు ఇవ్వాలని తెదేపా నాయకులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని