logo

రైతుబజారులో కందిపప్పు విక్రయ కౌంటర్‌

పెరిగిన ధరల నియంత్రణలో భాగంగా నాణ్యమైన కందిపప్పు కిలో రూ.165 అందిస్తోన్నట్లు జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు.

Published : 03 Jul 2024 02:33 IST

కందిపప్పు పంపిణీ చేస్తున్న జేసీ శ్రీనివాసులు

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: పెరిగిన ధరల నియంత్రణలో భాగంగా నాణ్యమైన కందిపప్పు కిలో రూ.165 అందిస్తోన్నట్లు జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రైతుబజారు, చర్చివీధిలోని వినాయక స్టోర్స్‌లో కందిపప్పు విక్రయ కౌంటర్లను జేసీ ప్రారంభించారు. ప్రస్తుతం కందిపప్పు ఉత్పత్తి, సరఫరా తక్కువగా ఉన్నందున డిమాండు పెరిగి మార్కెట్లో కిలో రూ.175 నుంచి రూ.200 ధర పలుకుతోందన్నారు. అధిక ధర చెల్లించి సామాన్యులు కొనుగోలు చేయలేరనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల, మార్కెటింగ్‌ శాఖల ఆధ్వర్యంలో రైతుబజారులో కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. గంగనపల్లిలో ఎండీయూ వాహనం ద్వారా అందజేస్తున్న బియ్యం పంపిణీని జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎస్‌వో శంకరన్, మార్కెటింగ్‌ శాఖ ఏడీ పరమేశ్వరన్, తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డి, డీటీ కిరణ్, రైతుబజారు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని