logo

వసతిగృహ నిర్మాణానికి నిధులు ఇస్తాం

వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసిన వెంటనే వసతిగృహానికి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వెల్లడించారు.

Published : 03 Jul 2024 02:13 IST

చౌడేపల్లె, సదుం, న్యూస్‌టుడే: వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసిన వెంటనే వసతిగృహానికి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వెల్లడించారు. చౌడేపల్లె మండలం కాటిపేరి పంచాయతీ అగస్తిగానిపల్లె సమీపంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల నిర్మాణ పనులను మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ నసీరుద్దీన్‌ వసతిగృహం విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. భూముల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సదుంలో నిర్మాణంలో ఉన్న పశువైద్య పాలిటెక్నిక్‌ కళాశాల భవనాలను పరిశీలించారు.


జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే:ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావును మంగళవారం నూతన కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్‌లో ఆయనకు కలెక్టర్‌ పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని