logo

99.07% మందికి.. పింఛన్ల పంపిణీ

పింఛన్ల పండగ రెండోరోజూ సందడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్‌ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొనసాగింది.

Published : 03 Jul 2024 01:59 IST

స్విమ్స్‌ అత్యవసర వార్డులో పింఛను అందిస్తున్న సచివాలయ ఉద్యోగి

తిరుపతి (భవానీనగర్‌), పాకాల, న్యూస్‌టుడే: పింఛన్ల పండగ రెండోరోజూ సందడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్‌ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. 99.07% మంది లబ్ధిదారులు పెంచిన పింఛను మొత్తం అందుకుని మురిసిపోయారు. మొత్తం 2,69162 మందికి రూ.180.63 కోట్ల మొత్తం పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు. తక్కినవారికి బుధవారం అందించనున్నారు.

కుక్కపల్లికి చెందిన వెంకటేశు కిడ్నీ సంబంధిత వ్యాధితో స్విమ్స్‌ లో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితిని కుటుంబ సభ్యులు చెప్పడంతో దామలచెరువు గ్రామ సచివాలయ సంక్షేమ సహాయకుడు అశోక్‌ స్విమ్స్‌ ఆసుపత్రికి వెళ్లి రూ.7 వేల పింఛను అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని