logo

మారని తీరు..

తిరుమల బైపాస్‌ మార్గంలో ఇటీవల విషపుజెర్రిని ఆహారంతో కలిపి వడ్డించిన హోటల్‌ నిర్వాకం పునరావృతమైంది.

Published : 03 Jul 2024 01:40 IST

సీజ్‌చేసి తెరిచిన హోటల్‌లో పాడైన చట్నీ

వడ్డించిన చట్నీ

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుమల బైపాస్‌ మార్గంలో ఇటీవల విషపుజెర్రిని ఆహారంతో కలిపి వడ్డించిన హోటల్‌ నిర్వాకం పునరావృతమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం వరకు విషయం చేరడంతో నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి అన్వేష్‌రెడ్డి అప్పటికప్పుడు స్పందించి హోటల్‌ను సీజ్‌చేశారు. అన్నిరకాలుగా శుభ్రత చర్యలు మెరుగుపరిచిన తరువాతే హోటల్‌ తలుపులు తెరిపించారు. ఇదే హోటల్‌లో మంగళవారం రాజశేఖర్‌ అనే ప్రభుత్వ ఉద్యోగి రూ.140 విలువైన టిఫిన్‌ను ఆర్డర్‌ ఇచ్చారు. చట్నీ పాడై వాసన వస్తుండటంపై సిబ్బందిని ప్రశ్నించగా సమాధానం లేదు. సూపర్‌వైజర్‌ వచ్చి పాత చట్నీని తీసివేసి కొత్త చట్నీని అందించి తినమన్నారు. ఆయన నగరపాలకసంస్థ ఆరోగ్యాధికారి అన్వేష్‌రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఇద్దరు ఉద్యోగులు వచ్చి వారితో మాట్లాడి వెళ్లిపోయారు. హోటల్‌ వ్యవహార శైలిని మొత్తం దృశ్యరూపంలో చిత్రించిన ఆయన అధికారులకు చేరవేశారు. నగరంలోని హోటళ్లలో చాలావరకు ఇదే పరిస్థితి ఉందని, అధిక ధరల తోడు నాణ్యమైన ఆహారం అందిస్తారన్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారన్న ఆవేదన అటు భక్తులు ఇటు నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని