logo

సుమిత్‌ మార్క్‌..!

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సుమిత్‌ కుమార్‌.. పరిపాలనలో తనదైన శైలిని చూపారు. ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాల వ్యవస్థ(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షాక్‌ ఇచ్చారు.

Published : 02 Jul 2024 03:01 IST

గ్రీవెన్స్‌కు రాని అధికారులకు షాక్‌
ప్రతి సోమవారం స్వయంగా హాజరు వేస్తానని స్పష్టీకరణ

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సుమిత్‌ కుమార్‌.. పరిపాలనలో తనదైన శైలిని చూపారు. ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాల వ్యవస్థ(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షాక్‌ ఇచ్చారు. కలెక్టరేట్‌ సోమవారం జరిగిన గ్రీవెన్స్‌కు పలు జిల్లా శాఖల అధికారులు హాజరు కాలేదు. కింది స్థాయి అధికారులను పంపడంతో ఆయన గుర్తించి మండిపడ్డారు. ఇకపై ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, తానే అటెండెన్స్‌ వేస్తానని స్పష్టం చేశారు. మండల అధికారులు ప్రతి సోమవారం తమ కార్యాలయాల్లో జరపాలన్నారు. ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారం లభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి 104 అర్జీలు వచ్చాయి. వాటిలో రెవెన్యూ సమస్యలు 81, డీఆర్‌డీఏ 12, ఇంకా వివిధ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి.
  • సాధారణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చు వివరాల్ని ఈ నెల 3లోగా అందించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ కోరారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు శంకర్‌ప్రసాద్‌ శర్మ, శ్రీనివాస్‌ ఖన్నా, రోహన్‌ ఠాకూర్‌తో కలిసి ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులు, ప్రతిపాదకులతో ఆయన సమీక్షించారు. ఖర్చు వివరాల్ని ఆన్‌లైన్‌ పోర్టల్‌ అప్‌లోడ్‌ చేస్తామన్నారు.

4న కుప్పంలో గ్రీవెన్స్‌.. కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 4న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో నియోజకవర్గ/మండల స్థాయి అధికారులు పాల్గొనాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు