logo

25 నెలలుగా వేతన బకాయిలు ఇవ్వలేదు

ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సమస్యలపై ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి.

Published : 02 Jul 2024 02:58 IST

నిరసనలో గ్రీన్‌ అంబాసిడర్లు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సమస్యలపై ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. పంచాయతీల్లో పనిచేస్తున్న స్వచ్ఛభారత్‌ గ్రీన్‌ అంబాసిడర్లకు 25 నెలలుగా పెండింగ్‌ వేతన బకాయిలు ఇవ్వడం లేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులకు వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కనీస వేతనం రూ.10 వేలు అమలుని గత ప్రభుత్వం విస్మరించిందని, నూతన ప్రభుత్వమైనా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. నాయకులు గోవిందస్వామి, చంద్ర, రమాదేవి, రమేష్, రాజేంద్ర, కృష్ణయ్య, మునెయ్య, మోసెస్, దేశప్ప పాల్గొన్నారు. ్ర అంగన్‌వాడీ కేంద్రం భవన స్థలాన్ని కొందరు ఆక్రమించారని పెద్దపంజాణి మండలం బెరపల్లి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులు ప్రహరీ కూల్చి 15 సెంట్ల భూమి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, జిల్లా అధికారులు న్యాయం చేయాలన్నారు. ్ర నీరు ప్రవహించే వంకను స్వార్థపరులైన భూస్వాములు పూడ్చి వేశారని పెనుమూరు మండలం కె.గొల్లపల్లి గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు, జలవనరుల శాఖ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు సర్వే చేయించి న్యాయం జరిపించాలని వేడుకున్నారు.

భూ ఆక్రమణపై ఫిర్యాదుచేసిన పెద్దపంజాణి మండలం బెరపల్లి గ్రామస్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని