logo

తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్సై మల్లికార్జున సోమవారం తెలిపారు.

Updated : 02 Jul 2024 08:26 IST

బాలాజీ (పాతచిత్రం)

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్సై మల్లికార్జున సోమవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. తవణంపల్లె మండలం ఎ.గొల్లపల్లెకు చెందిన బాలాజీ(30) దిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతడు ప్రస్తుతం ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం తిరుమల వెళ్లి తెచ్చిన ప్రసాదం బంగారుపాళ్యంలోని స్నేహితులకు ఆదివారం రాత్రి ఇచ్చి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బంగారుపాళ్యం- అరగొండ మధ్యలో వంకమిట్ట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పరీక్ష నిర్వహించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని