logo

శాంతి భద్రతలకు..విఘాతం కలిగించొద్దు

పుంగునూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎలాంటి సమావేశాలు, సభలు నిర్వహించేందుకు వెళ్లకూడదని,

Published : 01 Jul 2024 02:57 IST

ఎంపీ మిథున్‌రెడ్డికి పోలీసు నోటీసులు

తిరుపతి మారుతీనగర్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు 

జీవకోన(తిరుపతి), న్యూస్‌టుడే: పుంగునూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎలాంటి సమావేశాలు, సభలు నిర్వహించేందుకు వెళ్లకూడదని, నియోజకవర్గ పర్యటనను విరమించుకోవాలని రాజంపేట ఎంపీˆ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి పోలీసులు సూచించారు. పుంగునూరులో ఆదివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు తిరుపతిలోని తన నివాసం నుంచి బయల్దేరేందుకు యత్నించిన ఎంపీˆకి ఏఎసీˆ్ప కులశేఖర్‌ సమక్షంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు.  

మీ అరాచకాలు గుర్తులేవా? : చల్లా

రొంపిచెర్ల, న్యూస్‌టుడే: ఎంపీ మిథున్‌రెడ్డి గృహ నిర్బంధంపై పుంగనూరు తెదేపా ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి స్పందించారు. ఎంపీ చేసిన ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. గతంలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు, చేసిన దాడులు ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. గత రెండు సంవత్సరాల్లో ప్రతిపక్షంపై చేసిన దాడులు, అణచివేత కార్యక్రమాలు మీతండ్రిని అడిగి తెలుసుకోవాలన్నారు. తెదేపా కార్యకర్తలపై 307 కేసులు పెట్టారన్నారు. ఎన్ని ఛార్జిషీట్లు వేశారో, పుంగనూరు నియోజకవర్గంలో పెట్టిన కేసులు, జరిగిన అరాచకాలపై ఒక క్యాసెట్‌ రూపంలో పంపమంటే పంపిస్తామన్నారు. ఎన్ని రోజులు తెదేపా కార్యకర్తలు ఇళ్లు వదిలి అజ్ఞాతంలో గడిపారో ఓసారి తెలుసుకోవాలని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని