logo

విభజన హామీల అమలుకు కలిసి రావాలి

‘ఆంధప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వానికి నా అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలుకు కలిసి రావాలని ఆకాంక్షిస్తున్నామ’ని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Published : 01 Jul 2024 02:16 IST

ఆలయం ఎదుట మంత్రి పొన్నం ప్రభాకర్‌  

తిరుమల, న్యూస్‌టుడే: ‘ఆంధప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వానికి నా అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలుకు కలిసి రావాలని ఆకాంక్షిస్తున్నామ’ని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కొండగట్టులో స్వాగతం పలికాం. గతంలో తెలంగాణ భక్తులు ఇక్కడ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై సీఎం, దేవాదాయ శాఖ మంత్రి, నూతనంగా ఏర్పడే తితిదే ధర్మకర్తల మండలి దృష్టి సారించాల’ని కోరారు. కాంగ్రెస్‌లో వైకాపా భాగస్వామ్యం కోసం ప్రయత్నించడంపై తమకు ఎటువంటి సమాచారం లేదని.. ఎవరైనా ఇండియా కూటమిలోకి రావచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని