logo

రచనతో సమాజాన్ని ప్రభావితం చేయొచ్చు

నిజాన్ని భావితరాలకు అందించడంతో పాటు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఒక్క రచనకే ఉందని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, డాక్టర్‌ కలికిరి మురళీమోహన్‌ అన్నారు.

Published : 01 Jul 2024 02:14 IST

పుస్తకావిష్కరణలో ఎమ్మెల్యేలు జగన్మోహన్, మురళీమోహన్‌ 

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: నిజాన్ని భావితరాలకు అందించడంతో పాటు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఒక్క రచనకే ఉందని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, డాక్టర్‌ కలికిరి మురళీమోహన్‌ అన్నారు. పత్తిపాటి రమేష్‌నాయుడు రచించిన ‘పత్తిపాటి శతక రత్నావళి-3 పుస్తకాన్ని ఎమ్మెల్యేలు స్థానిక విజయం డిగ్రీ కళాశాలలో ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. భావితరాలకు మార్గనిర్దేశం చేసే వ్యక్తి రచయిత అని చెప్పారు. రచయిత ధైర్యశాలిగా, నిష్పక్షపాతంగా సమాజాన్ని సరైన కోణంలో అధ్యయనం చేయగలిగే మేథస్సు కలిగి ఉండాలన్నారు. యువతలో చైతన్యం తీసుకురావాలంటే పుస్తకాలు కారణమని తెలిపారు. కార్యక్రమంలో విజయం విద్యాసంస్థల ఛైర్మన్‌ తేజోమూర్తి, రచయిత పత్తిపాటి రమేష్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని