logo

రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి

రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు కృషి చేస్తున్నారని సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

Published : 01 Jul 2024 02:10 IST

ఆలయం ఎదుట కుటుంబ సభ్యులతో మంత్రి కొలుసు పార్థసారథి  

తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు కృషి చేస్తున్నారని సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి మూలమూర్తిని కుటుంసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న కష్టనష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించి, మంచి భవిష్యత్తును ఇవ్వడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి భరోసా కల్పించారని చెప్పారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రూ.4500 కోట్ల పింఛన్ల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరుస్తామన్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రూ.వెయ్యి పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రూ.వెయ్యి పెంచిందని తెలిపారు. వాలంటీర్లపై ప్రభుత్వం ఆలోచించి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని