logo

శోత్రీయ భూముల్లో మట్టి దొంగలు

చిన్నపాండూరులోని వివాద శోత్రీయ భూముల్లో దొంగలు పడ్డారు. వారెవరో కాదు..మట్టిని కొల్లగొట్టి అక్రమ రవాణా రుచిమరిగిన మట్టి దొంగలు..

Published : 01 Jul 2024 02:09 IST

రాత్రివేళ మట్టి తవ్వకాల్లో వాహనాలు 

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: చిన్నపాండూరులోని వివాద శోత్రీయ భూముల్లో దొంగలు పడ్డారు. వారెవరో కాదు..మట్టిని కొల్లగొట్టి అక్రమ రవాణా రుచిమరిగిన మట్టి దొంగలు.. ఉదయం ప్రజా నాయకుల్లా తిరుగుతూ రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా మట్టిని దోచేస్తున్నారు.  చిన్నపాండూరు పంచాయతీ వీకేఆర్‌వైకాలనీ సమీపంలో పాదిరికుప్పం రెవెన్యూలో సుమారు 1050 ఎకరాల శోత్రీయ భూములు వివాదంలో ఉన్నాయి. ఈ భూములను 2014-2019లో నాటి తెదేపా ప్రభుత్వం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పారిశ్రామికవాడగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. పక్కనే ప్రముఖ సంస్థలైన అపోలో, హీరో మోటార్స్‌ పరిశ్రమలున్నాయి. ఈ మార్గమే శ్రీసిటీ పరిశ్రమలకు ప్రధాన రహదారి కావడంతో మట్టి అక్రమ రవాణాకు వరమైంది.  అనుమతులు లేకుండా రాత్రివేళల్లో జేసీబీ, క్రేన్ల సాయంతో టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై తహసీల్దారు ఉదయభారతిని వివరణ కోరగా కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని