logo

అక్రమాలపై విచారణ జరపాలి

వైద్య శాఖ, విద్యుత్‌ శాఖల్లో ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు.

Published : 30 Jun 2024 01:57 IST

కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న తెదేపా నాయకులు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: వైద్య శాఖ, విద్యుత్‌ శాఖల్లో ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ మాట్లాడుతూ యువత జీవితాల్ని కాపాడేందుకు గంజాయి రహితంగా జిల్లాను తీర్చిదిద్దాలన్నారు. పూతలపట్టు అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచి, విద్యార్థులకు సీట్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో డయేరియా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్, మాజీ ఎంపీపీ జయచంద్రనాయుడు, సురేష్‌ పాల్గొన్నారు.

చిత్తూరు(జిల్లా పంచాయతీ): కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను పొరుగుసేవల ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. జిల్లా పొరుగు సేవల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు పి.బి.బాలసుబ్రహ్మణ్యం, ఐకాస నాయకులు రెడ్డిగోపాల్, సురేష్, ముఖేష్, జ్ఞానశేఖర్, సిద్ధారెడ్డి, గిరీష్, పురుషోత్తం, రాజేష్, నవీన్, రజనీ, కోకిల, ముస్తఫా, పాండు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని