logo

సర్వజన వైద్యశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగం ప్రారంభం

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎమర్జన్సీ మెడిసిన్‌ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు ప్రారంభించారు.

Published : 03 Jul 2024 04:46 IST

విభాగాన్ని ప్రారంభిస్తున్న సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎమర్జన్సీ మెడిసిన్‌ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఎమర్జెన్సీ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఎనిమిది క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు. వీరు అత్యవసర చికిత్స విభాగానికి వచ్చే కేసులన్నింటినీ పర్యవేక్షించటంతోపాటు వైద్యసేవలు అందిస్తారు. ఈ విభాగంలో హెచ్‌వోడీగా డాక్టర్‌ శ్రీనివాసులు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మనోహర్‌రెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు డాక్టర్‌ నూరుల్లాఖాన్, డాక్టర్‌ మహేశ్‌బాబులు పనిచేస్తారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విభాగం ఏర్పాటు చేయటం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ భీమసేనాచారి, ఆర్‌ఎంవో పద్మజ, డిప్యూటీ ఆర్‌ఎంవో హేమలత, సునీతతోపాటు వైద్యులు, సిబ్బంది హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని