logo

వైకాపాకు జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా

బ్రహ్మసముద్రం వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మంగళవారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Published : 03 Jul 2024 04:44 IST

బ్రహ్మసముద్రం, న్యూస్‌టుడే: బ్రహ్మసముద్రం వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మంగళవారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, పార్టీ అధిష్ఠానానికి పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్నేళ్లుగా మండలంలో పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశాను. వైకాపా అధికారంలో ఉన్నా ఏమాత్రం నిధులు మంజూరు కాకపోవడంతో జడ్పీటీసీ సభ్యురాలిగా ప్రజలకు న్యాయం చేయలేకపోయాను. అందుకే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని