logo

ఎన్నికల లెక్క చెప్పకపోతే అనర్హత వేటే

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విధిగా ఖర్చు లెక్క చెప్పాల్సిందే. లేదంటే.. అనర్హులుగా ప్రకటిస్తాం.

Published : 03 Jul 2024 04:37 IST

అభ్యర్థులకు వ్యయ పరిశీలకుల నిర్దేశం

మాట్లాడుతున్న కలెక్టర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్‌ వి.షిండే, నితిన్‌ అగర్వాల్, రాందాస్‌ టి.కాలే

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విధిగా ఖర్చు లెక్క చెప్పాల్సిందే. లేదంటే.. అనర్హులుగా ప్రకటిస్తాం. ఈనెల 3లోపు సమగ్ర వివరాలు ఇవ్వాలి.. అని ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్‌ వి.షిండే, నితిన్‌ అగర్వాల్, రాందాస్‌ టి.కాలే తేల్చి చెప్పారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్సు హాలులో కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి జిల్లా వ్యయ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ ముగ్గురు పరిశీలకులు మాట్లాడుతూ.. నామినేషన్‌ దాఖలు చేసిన నాటి నుంచి పోలింగ్‌ ఫలితాల తేదీ దాకా దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారో స్పష్టమైన వివరాలు అందించాలని చెప్పారు. ఇప్పటిదాకా కొన్ని రకాల లెక్కలు మాత్రమే చెప్పారు. తుది వివరాలు సమర్పించాలని సూచించారు. లేదంటే అనర్హత వేటు వేస్తామన్నారు. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ వ్యయం, ఖర్చులు, బిల్లులు, ఓచర్లు, అఫిడవిట్లు, బ్యాంకు పుస్తకాలు, ఏబీసీ రిజిస్టర్లు.. వంటి వాటిని సంతకంతో కూడిన వివరాలు సమర్పించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని