logo

అరాచక శక్తులతో పోరాడిన ధీశాలి పరిటాల రవి

బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన పరిటాల రవి నిప్పుకణిక లాంటి వారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు.

Published : 03 Jul 2024 04:35 IST

వెంకటాపురంలో మంత్రులు సత్యకుమార్, సవిత నివాళి

నివాళులు అర్పిస్తున్న మంత్రులు సత్యకుమార్, సవిత, ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్‌ తదితరులు

రామగిరి, న్యూస్‌టుడే: బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన పరిటాల రవి నిప్పుకణిక లాంటి వారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. రామగిరి మండలం వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్‌ను మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  సవితమ్మ సందర్శించి,  నివాళులు అర్పించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పరిటాల సునీత, తెదేపా నాయకుడు పరిటాల శ్రీరామ్‌ మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రవి ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. తర్వాత పరిటాల నివాసంలో అల్పాహార విందులో మంత్రులు పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ.. పెత్తందారులు, భూస్వాముల చెర నుంచి బలహీనవర్గాల ప్రజలను కాపాడేందుకు ఉద్భవించిన నిప్పుకణిక పరిటాల రవిని కొనియాడారు. ఆయన జీవితం బలహీన వర్గాల కోసం అంకితం చేశారన్నారు. ధర్మవరం అరాచక శక్తులతో పోరాడి ప్రజలకు అండగా నిలిచారన్నారు. ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ ప్రజలకు సేవ చేశారన్నారు. ఆయన లక్షణాలను పరిటాల శ్రీరామ్‌ పుణికి పుచ్చుకున్నారని, రవి బాటలో  నడస్తూ అండగా నిలబడ్డారన్నారు.

ఆస్పత్రి ఏర్పాటుకు వినతి

వెంకటాపురం గ్రామంలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్‌కు స్థానికులు వినతి అందజేశారు. తమ గ్రామానికి సమీపంలో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నా సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదన్నారు. వైద్యం కోసం ఎటు చూసినా 15 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని