logo

కథ మారింది.. దశ తిరిగింది

డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి సంతకం చేయడంతోపాటు టెట్‌ నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు.

Published : 03 Jul 2024 04:29 IST

బీసీ స్టడీ సర్కిల్‌కు జవసత్వాలు
డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, స్టైఫండ్‌

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి సంతకం చేయడంతోపాటు టెట్‌ నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు.  ఐదేళ్లుగా ఏవిధమైన శిక్షణ లేకుండా ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌కు సరికొత్త జవసత్వాలు తీసుకొచ్చారు. బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్జీటీ, పాఠశాల సహాయకులకు రెండింటికీ శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

ఇవీ తప్పని సరి

డీఎస్సీ, టెట్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ బయోడేటా అందివ్వాలి. టెట్‌ మార్కుల జాబితా, టీసీ, డిగ్రీ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం (తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు), ఆధార్, బ్యాంకు పాసు పుస్తకం, 2 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు జతపరచాలి. అనంతపురంలోని కలెక్టరేట్‌ సమీపంలో పెన్నార్‌ భవన్‌ పక్కనే ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తులు అందజేయాలి. మరిన్ని వివరాలకు నేరుగా గానీ ఫోన్‌ నంబరు 08554-275575కుగానీ సంప్రదించాలని సంచాలకులు ఖుష్భు కొఠారి తెలిపారు.

అర్హులు ఎవరంటే..

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా టీచర్‌ అర్హతా పరీక్ష (టెట్‌)లో అర్హత సాధించిన వారు అర్హులు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. 200 మందికి శిక్షణ ఇస్తారు. టెట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 7 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 11 నుంచి 60 రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుంది. రెండు బ్యాచ్‌లుగా విభజించి తరగతులు నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు శిక్షణ ఇస్తారు. ఒక్కోసారి నిపుణులు అందుబాటులోకి వస్తే కొంత సమయం మార్పు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కాలంలో 75 శాతం హాజరు ఉన్న వారికి రూ.3 వేలు స్టైఫండ్, స్టడీ మెటీరియల్‌ అందజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని