logo

‘భాజపాకు తెదేపా, జేడీయూ ఊతకర్రలు’

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు.

Published : 03 Jul 2024 04:26 IST

సమావేశంలో మాట్లాడుతున్న సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్‌.రఘువీరారెడ్డి

మడకశిర, న్యూస్‌టుడే : కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెదేపా, జేడీయూలు ఉతకర్రల్లా ఉన్నాయని అవి ఎప్పుడు జారిపోతాయో తెలియదని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం మడకశిరలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2029లో రాహుల్‌గాంధీ ప్రధాని అవ్వడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. చట్టాలు, రాజ్యాంగంపై భాజపాకు నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్నే మార్చాలని అనుకుంటున్నారే, అందుకే ఎక్కువ సీట్లు ఒకే పార్టీకి రావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. గత ప్రభుత్వంలో ఇది నిరూపితమైందన్నారు. వైకాపా ప్రభుత్వంలో విగ్రహాలు కూల్చారని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు కూల్చడం మంచిది కాదన్నారు. న్యాయం కోసం పోరాడే వారు న్యాయంగా పాలన సాగించాలన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్న సమయంలో రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సినవి అన్ని సాధించుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవంతం కావాలని, రాష్ట్రానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు. ప్రత్యేక హోదా అనేది మన హక్కు. పార్లమెంటులో కాంగ్రెస్‌ ఎంపీˆలతో కూడా మాట్లాడిస్తామని పేర్కొన్నారు. అందరూ కలిసి హక్కులను సాధించుకుందామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని