logo

పాసుపుస్తకం మంజూరుకు వినూత్న నిరసన

తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గంగన్న అనే రైతు చెప్పులు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు.

Published : 03 Jul 2024 04:16 IST

చెప్పులు మెడలో వేసుకుని నిరసన తెలుపుతున్న రైతు గంగన్న

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గంగన్న అనే రైతు చెప్పులు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు. బాధిత రైతు తెలిపిన మేరకు వివరాలు.. కదిరికి చెందిన గంగన్న కుటుంబ సభ్యులకు బ్రిటీష్‌ పాలనలో కదిరి పొలంలో 3.03 ఎకరాల భూమికి పట్టా ఇచ్చారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్నేళ్లుగా ఆ భూమిలో పంటలు పెట్టలేదు. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు ఆ భూమిని ఆక్రమించారు. కబ్జాదారుల నుంచి కాపాడి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌ వరకు కోరుతున్నా స్పందించలేదని గంగన్న వాపోయారు. భూమికి సంబంధించిన రికార్డులన్నీ అధికారులకు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా భూమిని సర్వేచేసి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని