logo

పింఛన్ల పంపిణీ ఇంటింటా నిర్వహించండి

కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా  శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆదేశించారు.

Published : 01 Jul 2024 03:57 IST

మంత్రి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను వృద్ధులకు ఇంటింటా పంపిణీ చేయాలని ఉరవకొండ నియోజకవర్గంలోని తెదేపా  శ్రేణులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో పాటు గ్రామ గ్రామాన పార్టీ శ్రేణులు పాల్గొనాలని సూచించారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలోని పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పింఛన్ల పంపిణీని పండగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. ఉదయాన్నే పార్టీ శ్రేణులు గ్రామ సచివాలయాల వద్దకు చేరుకుని, సీఎం చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించి, ఇంటింటా పింఛన్లను అందించేలా చూడాలన్నారు. వైకాపా అనుసరించిన విధానాలకు భిన్నంగా ముందుకు సాగుతూ లబ్ధిదారులకు ఇళ్ల వద్దే వాటిని పంపిణీ చేసి, ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు.

పాల్గొననున్న మంత్రి

పట్టణంలో సోమవారం నిర్వహించే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ పాల్గొననున్నట్లు పార్టీ శ్రేణులకు చెప్పారు. పట్టణ నాయకులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఆయన పాదయాత్రగా వెళ్తూ ఇంటింటా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బొకేలు, పూలదండలు లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని