logo

‘ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా రోహిల్‌కుమార్‌ వద్దు’

స్థానిక జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా గతంలో పనిచేసిన రోహిల్‌కుమార్‌ను మళ్లీ అదే స్థానంలో నియమించొద్దని హిందూపురం ప్రైవేట్‌ అంబులెన్స్‌ అసోసియేషన్‌ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Published : 01 Jul 2024 03:53 IST

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా గతంలో పనిచేసిన రోహిల్‌కుమార్‌ను మళ్లీ అదే స్థానంలో నియమించొద్దని హిందూపురం ప్రైవేట్‌ అంబులెన్స్‌ అసోసియేషన్‌ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేంలో సంఘం నాయకులు చాంద్‌బాషా, బిలాల్, షాహిద్, అశ్వక్, ముబారక్, సీపీఎం నాయకుడు రాము మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాప్రస్థానం పథకంలో ఉచితంగా ఆసుపత్రిలో మరణించిన వారిని స్వస్థలాలకు పంపేందుకు అంబులెన్స్‌ సౌకర్యం తీసుకొచ్చిందన్నారు. దీనిని అవకాశంగా చేసుకొని అప్పటి సూపరింటెండెంట్‌గా పనిచేసిన రోహిల్‌కుమార్‌ వీఐకేఎఫ్‌ ఫౌండేషన్‌కు సంబంధించిన అంబులెన్స్‌ను తీసుకొచ్చి మహాప్రస్థానం కింద మృతదేహాలు, అనారోగ్యానికి గురైనవారిని ఇతర ప్రాంతాలకు తరలించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ, ప్రభుత్వాం నుంచి వచ్చిన మొత్తాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. దీనిపై అప్పట్లో తాము జిల్లా అధికారుకు ఫిర్యాదు చేస్తే అతడిని పదవి నుంచి తొలగించి ఇతరులను నియమించారన్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల నుంచి అతను జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మళ్లీ ఆసుపత్రికి సూపరింటెండెంట్‌గా వచ్చేందుకు ప్రయస్తున్నార[ని, నియమించవద్దని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని