logo

ఉదయం 7 నుంచే ప్రజాప్రతినిధులు రంగంలోకి..

సోమవారం ఉదయాన్నే ప్రారంభం కానున్న ఎన్టీఆర్‌ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉరవకొండలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ హాజరు కాబోతున్నారు.

Published : 01 Jul 2024 03:53 IST

ఇంటింటా పింఛన్ల పంపిణీకి హాజరు

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: సోమవారం ఉదయాన్నే ప్రారంభం కానున్న ఎన్టీఆర్‌ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉరవకొండలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ హాజరు కాబోతున్నారు. మంత్రి ఉరవకొండలోని పాతపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర నిర్వహించే ఇంటింటా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఉదయం 7 గంటలకు ప్రారంభించి అనంతరం 1 గంట వరకు వివిధ వార్డుల్లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఉదయం 6 గంటలకు ఆత్మకూరు మండల కేంద్రంలో పాల్గొని అనంతరం అనంతపురం గ్రామీణం రాచానపల్లి, రాప్తాడు మండలం కేంద్రం, కనగానపల్లి మండలం మామిళ్లపల్లి, చెన్నేకొత్తపల్లి మండలం కేంద్రం, రామగిరి మండల కేంద్రాల్లో పాల్గొంటారు. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ అనంతపురం పాతూరులోని రాణినగర్‌ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం వద్ద ఉదయం 6 గంటలకు హాజరై అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగే ఇంటింటా పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఉదయం 8 గంటలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురంలో హాజరై అనంతరం నార్పల, పుట్లూరు, యల్లనూరు, శింగనమల, గార్లదిన్నె మండలాల్లో పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉదయం 7 గంటలకు కళ్యాణదుర్గం మండలం ముద్దనాయనపల్లిలో పాల్గొని అనంతరం బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాలతోపాటు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పాల్గొంటారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కసాపురంతోపాటు అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని