logo

బడుగు జీవులకు కూటమి భరోసా

శ్రీసత్యసాయి జిల్లాలో పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు రెట్టింపు భరోసా లభించనుంది.

Updated : 01 Jul 2024 03:55 IST

నేడే పింఛన్ల పండగ

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలో పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు రెట్టింపు భరోసా లభించనుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా.. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద నేరుగా ఇంటి వద్దకే సొమ్ము పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సచివాలయాల వారీగా ఉద్యోగులు శనివారమే పింఛన్‌ సొమ్మును డ్రా చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కరూ 50 నుంచి 60 మందికి పంపిణీ చేసేలా డబ్బులు ఇస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకే పంపిణీ ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కసారిగా పింఛను సాయం పెరగడంతో లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

  • శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా 2,71,383 మంది లబ్ధిదారులకు రూ.190.11 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా 544 వార్డు, గ్రామ సచివాలయాల్లో 4,532 మంది సిబ్బంది ఉన్నారు. లబ్ధిదారుకు పింఛను ఇచ్చిన తర్వాత నగదు అందినట్లుగా వారి నుంచి డిక్లరేషన్‌ (రసీదు) తీసుకోనున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రత్యేక కరపత్రం ఇవ్వనున్నారు.
  • పింఛన్ల పంపిణీ తొలిరోజే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంద శాతానికి చేరుకోవాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఎవరైనా మిగిలివుంటే 2వ తేదీ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తల నడుమ పండగ వాతావారణంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని