logo

హెచ్చెల్సీ ఆధునికీకరణ పనుల పునరుద్ధరణకు చర్యలు

జిల్లాకు సాగు, తాగునీరు అందించే హెచ్చెల్సీ ఆధునికీకరణ అంశాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్లికి తీసుకెళ్లి.. పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు.

Published : 29 Jun 2024 04:30 IST

మరమ్మతు పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అధికారులు

బొమ్మనహాళ్, డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: జిల్లాకు సాగు, తాగునీరు అందించే హెచ్చెల్సీ ఆధునికీకరణ అంశాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్లికి తీసుకెళ్లి.. పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం డి.హీరేహాళ్‌ మండలం చెర్లోపల్లి వద్ద కాలువ మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు కాలువ కొన్నిచోట్ల కోతకు గురైందన్నారు. వాటికి మరమ్మతు పనులు కొనసాగుతున్నాయన్నారు.ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం హెచ్చెల్సీకి ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో గట్లు బలహీనపడి, కంపచెట్లతో నిండిపోయి అధ్వానంగా మారిందన్నారు. గత తెదేపా హయాంలో ఆధునికీకరణ పనులు చేపట్టినా.. జగన్‌ సర్కారు ఆపేసిందని తెలిపారు. డీఈఈ మద్దిలేటి, ఏఈఈ ఆల్తప్, తెదేపా నాయకులు బలరామిరెడ్డి, మల్లికార్జున, కేశవరెడ్డి, పయ్యావుల అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని