logo

మీ ఇళ్లలో మరుగుదొడ్లు ఇలాగే ఉంచుకుంటారా?

స్థానిక బాలికల జూనియర్‌ కళాశాలను శుక్రవారం మధ్యాహ్నం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగదిని సందర్శించి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 29 Jun 2024 04:46 IST

బాలికల జూనియర్‌ కళాశాల తనిఖీలో మంత్రి సవిత

మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి

పెనకొండ పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక బాలికల జూనియర్‌ కళాశాలను శుక్రవారం మధ్యాహ్నం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగదిని సందర్శించి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాలలో తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థినులు బాగా చుదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కళాశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి మీ ఇంట్లో ఇలాగే ఉంచుకొంటారా అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గంధం వెదజల్లుతూ అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్డి ఉపయోగించడం వల్ల విద్యార్థినులు అనారోగ్యం పాలవుతారని, పరిశుభ్రతపై దృష్టి సారించి, విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయినులకు సూచించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని