logo

తెదేపా బలోపేతానికి కృషి

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేస్తామని అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్‌ పేర్కొన్నారు.

Published : 29 Jun 2024 04:08 IST

 తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును అభినందిస్తున్న అనంతపురం జిల్లా అధ్యక్షుడు
వెంకటశివుడుయాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్‌ తదితరులు 

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేస్తామని అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలోని ఎన్‌టీఆర్‌ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొత్త అధ్యక్షుడికి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శులు సాకే గంపన్న, దేవళ్ల మురళి, రాయల్‌ మురళి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు నటేశ్‌చౌదరి, జకీవుల్లా, క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని