logo

‘రుణాల మంజూరులో అక్రమాలు వెలికితీయండి’

రాప్తాడు నియోజకవర్గంలో గత ఐదేళ్లలో మహిళా సంఘాల రుణాల మంజూరులో జరిగిన అక్రమాలను బయటకు తీయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు.

Published : 29 Jun 2024 04:07 IST

సమీక్షిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత 

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: రాప్తాడు నియోజకవర్గంలో గత ఐదేళ్లలో మహిళా సంఘాల రుణాల మంజూరులో జరిగిన అక్రమాలను బయటకు తీయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. శుక్రవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల డీఆర్‌డీఏ పీడీలు, ఏపీవోలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్ని మహిళా సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘానికి ఎంత రుణం ఇచ్చారన్న దానిపై సమగ్రంగా నివేదిక అందజేయాలన్నారు. రుణాల మంజూరులో అక్రమాలకు పాల్పడినట్లు తేలితే ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పూర్తిగా దారి మళ్లినట్లు తెలిసింది. కేవలం ఎస్సీ, ఎస్టీలకే ఉపయోగాల్సిన నిధులను ఇతర అవసరాలకు వాడుకోవడం సరికాదన్నారు. వీటిపై లెక్కలు తేల్చాలన్నారు. వీవోఏల పని తీరు బాగోలేదన్నారు. మహిళలకు జీవనోపాధులు ఏమి కల్పించారో అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాల సహకార డెయిరీపై ఆరా తీశారు. డెయిరీలో ఎంత మంది మహిళలు పెట్టుబడి పెట్టారు. ఎంత మందికి ఎంత లబ్ధి చేకూరింది. డెయిరీ స్థితిగతులపై పూర్తి నివేదిక అందజేయాలన్నారు. పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఒకటో తేదీన గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి అందించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని