logo

Anantapur: ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన తల్లి మృతి

తొలి కాన్పులోనే (ఇద్దరు మగ, ఓ ఆడ) ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి అస్వస్థతకు గురై మృత్యువాత పడిన ఘటన పెనుకొండ మండలం మోటువారిపల్లిలో జరిగింది.

Updated : 05 Jul 2024 05:28 IST

కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సవిత

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: తొలి కాన్పులోనే (ఇద్దరు మగ, ఓ ఆడ) ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి అస్వస్థతకు గురై మృత్యువాత పడిన ఘటన పెనుకొండ మండలం మోటువారిపల్లిలో జరిగింది. భర్త తెలిపిన వివరాల మేరకు.. మోటువారిపల్లికి చెందిన గిరిరాజుకు 2020, సెప్టెంబరు 18న కురుబవాండ్లపల్లికి చెందిన వెన్నెల(24)తో వివాహం జరిపించారు. ఆమె గత నెల 29న అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి అస్వస్థతకు గురైంది. అక్కడే చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. గురువారం మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చారు. బాలింత మృతిచెందడంతో ఆకుటుంబంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. విషయం తెలుసుకొన్న మంత్రి సవిత గ్రామానికి వెళ్లి బాలింత మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రి వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని