logo

పోలవరం కుడి కాలువకు 2,832 క్యూసెక్కుల నీరు విడుదల

పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా పోలవరం కుడి కాలువలోకి విడుదల చేసిన నీరు గురువారం సాయంత్రానికి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోకి చేరినట్లు జలవనరులశాఖాధికారులు చెప్పారు.

Updated : 05 Jul 2024 04:42 IST

పోలవరం, న్యూస్‌టుడే: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా పోలవరం కుడి కాలువలోకి విడుదల చేసిన నీరు గురువారం సాయంత్రానికి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోకి చేరినట్లు జలవనరులశాఖాధికారులు చెప్పారు. మొత్తం ఎనిమిది పంపుల ద్వారా కుడి కాలువలోకి 2,832 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నట్లు పర్యవేక్షణ డీఈ పెద్దిరాజు తెలిపారు. గోదావరిలో నీటి మట్టం 14.74 మీటర్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో గోదావరిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 26.39 మీటర్లుగా ఉంది. 48 గేట్ల నుంచి దాదాపు 50 వేల క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నట్లు పర్యవేక్షణ ఈఈ పి.వెంకటరమణ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని