logo

రంగా ఆశయ సాధనకు కృషి

దివగంత వంగవీటి మోహనరంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవుదామని ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Published : 05 Jul 2024 04:34 IST

 రేవతి సెంటరు రంగా విగ్రహం వద్ద కేక్‌ కోస్తున్న మంత్రి రవీంద్ర, కూటమి నాయకులు

మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: దివగంత వంగవీటి మోహనరంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవుదామని ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రంగా జయంతి పురస్కరించుకుని చిలకలపూడి, రేవతి సెంటర్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రితో పాటు జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బండి రామకృష్ణ, రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్‌ ధర్మారావు, కూటమి నాయకులు రంగా విగ్రహానికి పూలమాలలు వేయడంతో పాటు కేక్‌ కోసి ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ మచిలీపట్నంతో రంగాకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల కోసం రంగా అభిమానులు క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్న మంత్రి రవీంద్ర వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. రాధారంగా మిత్రమండలి జిల్లా మహిళా అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, కూటమి నాయకులు కొట్టె వెంకట్రావు, మాదివాడ రాము, పంతం గజేంద్ర, తిరుమలరావు, వెంకన్న, హసీంబేగ్, తదితరులతో పాటు పలువురు రంగా అభిమానులు పాల్గొన్నారు.

పేదల పక్షపాతి రంగా

పెనమలూరు, న్యూస్‌టుడే: వంగవీటి మోహన రంగా పేదల పక్షపాతిగా చెరగని ముద్ర వేసుకున్నారని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ పేర్కొన్నారు. పోరంకిలో నిర్వహించిన రంగా జయంతిలో ఎమ్మెల్యే ప్రసాద్, రంగా కుమారుడు రాధాతో కలిసి  రంగా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ప్రసాద్‌ మాట్లాడుతూ పేదల కోసం పోరాడి ఆయన ప్రాణాలు కోల్పోయారని, ఆయన ఆశయ సిద్ధికి కృషి చేయాలన్నారు. లక్షలాది అభిమానులున్న రంగా తనయుడిగా పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా  తెలిపారు. తెదేపా, జనసేన నాయకులు చెన్నుపాటి శ్రీనివాస్, వంగూరు మురళీ, వంగూరు లీల, వీర్ల సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని