logo

రూ.2 వేల కోట్ల టర్నోవర్‌ లక్ష్యం

రానున్న అయిదేళ్లలో విజయ డెయిరీ వార్షిక టర్నోవర్‌ రూ.2 వేల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని విజయ డెయిరీ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు.

Published : 05 Jul 2024 04:27 IST

విజయ డెయిరీ ఛైర్మన్‌ చలసాని

ఛైర్మన్‌ ఆంజనేయులును అభినందిస్తున్న సిబ్బంది, పాల సంఘాల అధ్యక్షులు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: రానున్న అయిదేళ్లలో విజయ డెయిరీ వార్షిక టర్నోవర్‌ రూ.2 వేల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని విజయ డెయిరీ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం ఛైర్మన్‌ చలసాని పుట్టినరోజు సందర్భంగా వీరవల్లిలోని ప్రాజెక్టు కామధేను ప్లాంట్‌లో పాల సంఘాల అధ్యక్షులు, ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చలసాని మాట్లాడుతూ.. పాడి పరిశ్రమను స్థిరమైన ఉపాధి మార్గంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా గత అయిదేళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తున్నామన్నారు. ఆ ఫలితంగానే అత్యధిక ధర, క్రమం తప్పకుండా బోనస్‌ చెల్లింపులు, వీరవల్లిలో అధునాతన ప్లాంటు నిర్మాణం సాకారం చేయగలిగామన్నారు. కల్యాణమస్తు, క్షీరబంధు, ఉన్నత విద్యకు చేయూత వంటి విప్లవాత్మక పథకాల ద్వారా రైతు కుటుంబాలకు చేయూత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎండీ కొల్లి ఈశ్వర్‌ బాబు, ప్లాంట్‌ హెడ్‌ సరిత, హనుమాన్‌జంక్షన్‌ మేనేజర్‌ మాగంటి హరిబాబు, ట్రస్ట్‌ బోర్డు డైరెక్టర్‌ పిన్నమనేని లక్ష్మీప్రసాద్, తెదేపా నాయకులు జి.ఉమా ప్రసాద్, ఎల్‌.శ్రీధర్, ఎం.నాగరాజు, కె.వెంకటేశ్వరరావు, వివిధ పాల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని