logo

దుర్గగుడి చీరల వ్యవహారంపై ఆడిట్‌ అభ్యంతరాలు

దేవాదాయ శాఖలో గడచిన ఐదేళ్లలో జరిగిన అవినీతిపై పాపాల పుట్ట బద్దలైంది. దేవాదాయ శాఖ సహాయ కమిషనరు సస్పెండ్‌ అయిన విషయం వెలుగు చూసిన వెంటనే దుర్గగుడిలో భక్తులు సమర్పించిన విలువైన పట్టు చీరల సమర్పణపై ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి

Published : 03 Jul 2024 06:00 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : దేవాదాయ శాఖలో గడచిన ఐదేళ్లలో జరిగిన అవినీతిపై పాపాల పుట్ట బద్దలైంది. దేవాదాయ శాఖ సహాయ కమిషనరు సస్పెండ్‌ అయిన విషయం వెలుగు చూసిన వెంటనే దుర్గగుడిలో భక్తులు సమర్పించిన విలువైన పట్టు చీరల సమర్పణపై ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో భక్తులు సమర్పించిన చీరల సేకరణ, వేలం నిర్వహణలో జరిగిన అవకతవకలపై వైకాపా ప్రభుత్వం మారగానే ఆడిట్‌ అభ్యంతరాలు ఊపందుకున్నాయి. చీరల విక్రయం ద్వారా ఏడాదికి రూ.5 కోట్లు ఆదాయం వస్తుంటే కొందరు అధికారులు రూ.3 కోట్లకే గుత్తేదారుకు కట్టబెట్టడంపై ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై ఆడిట్‌ విభాగం సైతం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.దీనిపై అప్పటి పాలక మండలి ఛైర్మన్‌ తొలుత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తర్వాత మౌనం దాల్చడం వెనుక కూడా విమర్శలు తలెత్తాయి. భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలను కంప్యూటరులో నమోదు చేయడంలో సైతం అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం. అందుకు నిదర్శనం గడచిన ఐదేళ్లలో పట్టు చీరల స్థానంలో సాధారణ చీరలు ఉంచి విలువైన చీరలను అమ్మి వేశారని ఆరోపణలు ఉన్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని