logo

మచిలీపట్నంలో ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలి

మచిలీపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇండియన్‌ ఆయిల్‌ లేదా భారత్‌ పెట్రోలియం ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.

Published : 03 Jul 2024 05:52 IST

లోక్‌సభలో మాట్లాడుతున్న ఎంపీ బాలశౌరి 

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: మచిలీపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇండియన్‌ ఆయిల్‌ లేదా భారత్‌ పెట్రోలియం ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. మంగళవారం నిర్వహించిన పార్లమెంట్‌ సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడి సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. మచిలీపట్నం పోర్టు ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన ప్రాంతమని, ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. మచిలీపట్న-రేపల్లె మధ్య రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బందరు పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించడంతో పాటు గ్రీన్‌ ఎనర్జీని అందజేసే ప్రాజెక్టులను ప్రోత్సహించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్కొక్కరికీ రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి మద్దతు కావాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధానమైన అంశాలు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులని, వీటిని పూర్తి చేసేందుకు దయజేసి నిధులు కేటాయించాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని