logo

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు

ఈఏపీసెట్‌-2024 ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు ఉమ్మడి కృష్ణాలో ప్రక్రియ మొదలైంది.

Published : 03 Jul 2024 05:49 IST

ఇంజినీరింగ్‌ విద్యార్థులు 

న్యూస్‌టుడే, కానూరు, తాడిగడప: ఈఏపీసెట్‌-2024 ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు ఉమ్మడి కృష్ణాలో ప్రక్రియ మొదలైంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులు జులై ఒకటో తేదీ  నుంచి ఏడో తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. 

అందుబాటులో కొత్త బ్రాంచులు

కళాశాలలో ప్రస్తుతం ఉన్న సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్‌తో పాటు సీఎస్‌ఈలో ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, మెషీన్‌ లెర్నింగ్‌ బ్రాంచులు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ కళాశాలల్లో గŸతం కన్నా సీఎస్‌ఈ సీట్లు పెంచారు.

నగరంలో మూడు హెల్ప్‌లైన్‌ కేంద్రాలు 

విజయవాడ నగరంలో ఈఏపీసెట్‌-2024 అడ్మిషన్ల ప్రక్రియకు మూడు హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్, ఎస్‌ఆర్‌ఆర్‌సీవీఆర్‌ డిగ్రీ, ఆంధ్ర లయోలా కళాశాలలను ఎంపిక చేశారు. విద్యార్థులకు ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినట్లయితే ఆయా కేంద్రాలకు వెళ్లి సరిచేసుకోవచ్చు. విద్యార్థులకు రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో ఏమైనా సందేహాలున్నా ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

  • 1 నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతరులకు రూ.1200) బీ 4 నుంచి 10వరకు

ధ్రువపత్రాల పరిశీలన

  • 8 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపిక
  • 13వ తేదీన ఆప్షన్ల మార్పునకు అవకాశం
  • 16న సీట్ల కేటాయింపు
  • జులై 19 నుంచి కళాశాలలో తరగతుల ప్రారంభం
  • జులై 17 నుంచి 22 వరకు సెల్ఫ్‌ జాయినింగ్‌ కళాశాలలో రిపోర్టింగ్‌

     జాగ్రత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

మొదట విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అక్కడ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి అన్ని సర్టిఫికేట్లు అప్‌లోడ్‌ చేయించాలి. ఇక్కడ మొబైల్‌ నంబరు, మెయిల్‌ ఐడీ ఇవాల్సి ఉంటుంది. తరువాత అన్ని వివరాలు ఆన్‌లైన్‌ సబ్‌మిట్‌ చేస్తే ఆ సమాచారం మొత్తం మొబైల్‌ ఫోన్లకు సంక్షిప్త సందేశం వస్తుంది. బ్రాంచులు, కళాశాలల ఎంపిక సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వీలైనన్ని ఎక్కువ కళాశాలలు ఎంపిక చేసుకోవాలి. మన ర్యాంకుకు ఏ కళాశాలలో సీటు వస్తుందో, గత సంవత్సరం కట్‌ ఆఫ్‌ ఎంత ఉందో చూసుకోవాలి. తప్పులు లేకుండా నమోదు చేసుకుంటే సీటు కేటాయింపులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. 
- జి.నరసింహస్వామి, ఆచార్యుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని