logo

కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు

ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్‌లో నమోదైంది.

Published : 02 Jul 2024 05:10 IST

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్‌లో నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం... పద్మావతి ఘాట్‌ సమీపంలోని రైలు వంతెన దిగువ కృష్ణా నదిలో సోమవారం మృతదేహం తేలియాడుతున్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి మగ వ్యక్తిగా నిర్ధారించారు. మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే వివరాలు లభించలేదు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లుగా భావిస్తున్నారు. శరీరంపై నీలిరంగు టీషర్టు, అదే రంగు కలిగిన నిక్కరు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గతంలో సీఆర్పీసీ 174కు బదులు మారిన కొత్త నేర చట్టాల్లో భాగంగా బీఎన్‌ఎస్‌ఎస్‌ (భారతీయ నాగరిక సురక్ష సంహిత-194(1) కింద కేసు నమోదు చేశారు. ఉదయం 11 గంటలకు ఫిర్యాదు రాగా 12 గంటలకు కొత్త చట్టంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని