logo

స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే

తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు.

Published : 02 Jul 2024 05:01 IST

రోడ్డు కంటే అడుగున్నర ఎత్తులో నిర్మించిన కాలువలు

తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. 2022 జులై 14న గ్రామంలో మంచినీటి సరఫరా పైప్‌లైన్‌ లీకు అయ్యింది. డ్రెయిన్‌లో వేసిన పైప్‌లైన్‌లోకి మురుగు ప్రవేశించడంతో గ్రామస్థులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వర్షాకాలం నేపథ్యంలో తొలుత సాధారణ వాంతులు, విరేచనాలుగా అధికారులు భావించారు. పరిస్థితి విషమించి నలుగురు చనిపోవడంతో స్థానికంగా వైద్యశిబిరాల ఏర్పాటు, అరకొర పారిశుద్ధ్య చర్యలతో మమ అనిపించారు. అప్పటి జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా సహా అధికార యంత్రాంగం మొత్తం వారం పాటు గ్రామంలో ఉండి పరిస్థితిని కుదుటపడే వరకు పర్యవేక్షించారు. కానీ గ్రామంలో మంచినీటి సరఫరా లోపాలు, అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థ, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదు కానీ తూతూమంత్రంగా చేపట్టిన పనులతో కొత్త సమస్యలను వైకాపా నాయకులు సృష్టించారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం మొదలైన వర్షాకాలం ఈసారి ఎంతమందిని కాటేస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీసీ రోడ్డు నిర్మించకుండా అడుగున్నర ఎత్తులో మట్టి పోయడంతో బురదగా మారిన బల్లిపర్రు- తెంపల్లె రోడ్డు

కాలువలో సిల్ట్‌ తీయకపోవడంతో నిండిపోయి రోడ్డుపై పారుతున్న మురుగు

ఈనాడు కృష్ణా, గన్నవరం గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని