logo

మళ్లీ అతిసారం కేసులు!

గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్‌పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్‌సీకి వచ్చిన ఆరుగురిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకున్నారు.

Published : 02 Jul 2024 04:56 IST

పట్టణ శివార్లలో ఫాగింగ్‌ చేస్తున్న ప్రజారోగ్య సిబ్బంది

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్‌పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్‌సీకి వచ్చిన ఆరుగురిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకున్నారు. జగ్గయ్యపేట పట్టణం నుంచి ముగ్గురు, చిల్లకల్లు, బూదవాడ, కాకారవాయిల నుంచి ఒక్కొక్కరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వర్షాల కారణంగా తాగునీరు, ఆహార కాలుష్యాలకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య, ప్రజారోగ్య అధికారులు సూచించారు. సోమవారం వైద్యారోగ్య సిబ్బంది దీనిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజారోగ్య అధికారులు దోమలు, మురుగు నివారణ చర్యలు చేపట్టి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని