logo

ఈ సారైనా కాల్వల ప్రక్షాళన జరిగేనా..?

కొత్త ప్రభుత్వం వచ్చింది. పంట, మురుగు కాల్వల్లో అల్లుకుపోయిన గుర్రపు డెక్క, తూడుకాడ నిర్మూలనకు జూన్‌లోనే నిధులు కేటాయించింది.

Published : 01 Jul 2024 05:53 IST

న్యూస్‌టుడే, కౌతవరం(గుడ్లవల్లేరు): కొత్త ప్రభుత్వం వచ్చింది. పంట, మురుగు కాల్వల్లో అల్లుకుపోయిన గుర్రపు డెక్క, తూడుకాడ నిర్మూలనకు జూన్‌లోనే నిధులు కేటాయించింది. వాటి తొలగింపుతో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఏటా మేలో జరగాల్సిన పనులు జులైలో వర్షాల సమయంలో టెండర్లు ఖరారు చేసి నిదానంగా పనులు చేపడుతుండడంతో వర్షాలు, నీటి ఒరవడికి రైతులు పంటలు నష్టపోతున్నారు. ఏడాదిలో ఒకసారే గుత్తేదారులు పనులు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు.

అలాగే ఎగువున గుర్రపు డెక్క తొలగించి ఒడ్డున వేయకుండా కిందకు తోయడంతో టెండర్ల ఖర్చులు అధికమై గుత్తేదారులు లాభపడుతూ రైతులను అవస్థలపాల్జేస్తున్నారు. ఏప్రిల్‌లో గ్రామాల్లో మంచినీటి చెరువులకు నీరు వదిలితే గుడ్లవల్లేరు పుల్లేరు రైల్వేవంతెన వద్ద భారీగా డెక్క మేటవేయడంతో నీరు దిగువకు రాక చెరువులు నింపేందుకు అగచాట్లు పడ్డారు. దీనిపై ‘ఈనాడు’లో వెలువడిన కథనాలతో ఎస్‌ఈ స్వయంగా మూడు రోజులపాటు వచ్చి వంతెన వద్ద కూర్చుంటేనే తప్ప పనులు కాలేదు. ఈసారైనా అధికారులు సక్రమంగా గుత్తేదారులతో ఎప్పటికప్పుడు కాల్వల్లో డెక్క, తూడు సక్రమంగా తీయించాలని రైతులు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు