logo

జిల్లా అంతటా భారీ వర్షాలు

జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం..

Updated : 01 Jul 2024 05:58 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. తిరువూరు 69.4 మి.మీ., జి.కొండూరు 62.6, రెడ్డిగూడెం 60.2, మైలవరం 54.4, విస్సన్నపేట 52.2, జగ్గయ్యపేట 50.2, ఇబ్రహీంపట్నం 45.2, పెనుగంచిప్రోలు 43.6, వీరులపాడు 43.4, చందర్లపాడు, విజయవాడ తూర్పు 40.4, విజయవాడ ఉత్తరం 40.2, విజయవాడ సెంట్రల్, పశ్చిమ 39.4, నందిగామ 38.8, కంచికచర్ల, విజయవాడ గ్రామీణ 37.2, ఎ.కొండూరు 35.4, గంపలగూడెం 34.4, వత్సవాయిలో 32.2 మి.మీ. మేర వర్షం పడింది. జిల్లాలో సగటు వర్షపాతం 44.81 మి.మీ.గా ఉంది.  


లోతట్టు ప్రాంతాలు జలమయం

 చెరువును తలపిస్తున్న పామర్రు బస్టాండు 

గుడివాడ పట్టణం, పామర్రు, న్యూస్‌టుడే: రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం ఇబ్బందికరంగా మారింది. గుడివాడ, పామర్రు బస్టాండ్లలో వాన నీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి. లోపలికి వెళ్లేందుకు ఆస్కారం లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని బస్సులు బస్టాండులోకి రాకుండానే రోడ్లపై ఆపి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిపోయారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండు నాలుగు వైపులా నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో బస్టాండు నిర్మాణానికి కాలయాపన చేయడంతో వర్షం కురిసినప్పుడల్లా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.

గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్‌ వెనుక కాలనీలోని ప్రధాన రహదారి దుస్థితి..

 

గుడివాడ ఆర్టీసీ బస్టాండు దక్షిణం వైపు ఇలా.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని