logo

ఉత్తరాంధ్ర జీవనానికి అద్దం.. కళింగాంధ్ర కథా జాడ

ఉత్తరాంధ్ర జీవన స్థితిగతులకు ‘కళింగాంధ్ర కథా జాడ’ పుస్తకం అద్దం పడుతుందని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ అన్నారు.

Published : 01 Jul 2024 05:42 IST

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : ఉత్తరాంధ్ర జీవన స్థితిగతులకు ‘కళింగాంధ్ర కథా జాడ’ పుస్తకం అద్దం పడుతుందని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ అన్నారు. ఆదివారం విజయవాడలో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో మేడే-2024 సాహిత్య పురస్కారాల సభ, నాలుగు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అట్టాడ అప్పలనాయుడు, చీకటి దివాకర్‌లు సంపాదకులుగా తీసుకొచ్చిన ‘కళింగాంధ్ర కథా జాడ’ పుస్తకాన్ని సాహితీ స్రవంతి ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఉత్తరాంధ్ర జీవన పరిస్థితులు, ఉద్యమాలు, వాటి పరిణామాలు, భౌగోళిక పరిస్థితులు ప్రస్తావించారని చెప్పారు. అలాగే ‘మాసిపోని మరకలు కథా సంకలనం’, ‘క్షేత్రం కవితా సంకలనం’, ‘దీపం పాటల సంకలనం’ పుస్తకాలను ఆవిష్కరించారు. ఉత్తమ పాట, కథ, కవిత విభాగాల్లో విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. రచయితలు కె.ఉషారాణి, సీతారామ్, ఆవిష్కరించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా రచనలు ఉండాలని సాహిత్య ప్రస్థానం ప్రధాన సంపాదకుడు తెలకపల్లి రవి అన్నారు. సుంకర గోపాలయ్య, పోలవరపు సాంస్కృతిక వేదిక బాధ్యుడు గోళ్ల నారాయణరావు, జాషువా సాంస్కృతిక వేదిక బాధ్యులు గుండు నారాయణరావు, సాహితీ స్రవంతి ప్రతినిధి వరప్రసాద్, ప్రముఖ న్యాయవాది సంపర శ్రీనివాసరావు, సాహితీ స్రవంతి నాయకురాలు శాంతిశ్రీ, ప్రజానాట్యమండలి గాయకుడు జగన్, తెలంగాణ సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి, ప్రముఖ స్త్రీవాద కవయిత్రి మందరపు హైమావతి, అరసం నాయకులు పరుచూరి అజయ్, సాహితీవేత్త డాక్టర్‌ రావేళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని