logo

సచివాలయ ప్రణాళిక కార్యదర్శి భవ్య సస్పెన్షన్‌

నందిగామ పురపాలక సంఘం పరిధిలో అక్రమాలకు పాల్పడిన నాలుగో వార్డు సచివాలయ ప్రణాళిక కార్యదర్శి బాణాల భవ్యను కమిషనర్‌ హేమమాలిని సస్పెండ్‌ చేశారు.

Published : 30 Jun 2024 05:31 IST

 నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ పురపాలక సంఘం పరిధిలో అక్రమాలకు పాల్పడిన నాలుగో వార్డు సచివాలయ ప్రణాళిక కార్యదర్శి బాణాల భవ్యను కమిషనర్‌ హేమమాలిని సస్పెండ్‌ చేశారు. ఆమె అక్రమాలపై పట్టణానికి చెందిన చండ్ర గోవర్ధన్‌సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్‌ విచారణ చేపట్టారు. అక్రమాలు నిర్ధారణ కావడంతో శనివారం చర్యలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, అప్పటి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుల మద్దతు తనకుందని సహచర ఉద్యోగుల లాగిన్‌లోకి వెళ్లి మరీ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. నిషేధిత భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఆమె ఇతర వార్డు సచివాలయాల ప్రణాళిక విభాగం ఉద్యోగుల విధుల్లోనూ జోక్యం చేసుకుంటూ పలు అనుమతులు జారీలో కీలకంగా వ్యవహరించారు. పదో వార్డులోని ఐదో సచివాలయ పరిధిలో ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ ఇంటి పక్కన తన తండ్రి భవన నిర్మాణానికి నిబంధనలకు విరుద్ధంగా తానే ఆన్‌లైన్‌లో అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణంలోనూ నిబంధనలు ఖాతరు చేయలేదు. విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో సస్పెండ్‌ చేసినట్లు కమిషనర్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు చెప్పారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని