logo

రైతుల డిమాండ్లు సాధించే వరకు పోరాటం

రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు, ఉద్యమాలు కొనసాగుతాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు.

Published : 30 Jun 2024 05:29 IST

 మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న శోభనాద్రీశ్వరరావు గోపాలకృష్ణ, ఝాన్సీ, కేశవరావు, ప్రసాద్, రాజమోహన్‌ తదితరులు 

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే : రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు, ఉద్యమాలు కొనసాగుతాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దిల్లీలో 14 నెలల పాటు నిర్వహించిన ఉద్యమం ఫలించిందన్నారు. రైతులకు ద్రోహం చేసిన భాజపాకు సీట్లు తగ్గాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మనుగడ సాధించలేదని భాజపా బలం తగ్గడానికి రైతు ఉద్యమమే ప్రధాన కారణమని చెప్పారు.   నిజమైన రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చింకుండా గుర్తింపు లేని రైతు సంఘాలతో చర్చలు జరపడం విచారకరమన్నారు. పార్లమెంటులో రైతు సమస్యలు చర్చకు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జులై 10వ తేదీన న్యూదిల్లీలో జరిగే సమావేశానికి రైతులంతా హాజరుకావాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా ‘రామోజీ’ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు  వై.కేశవరావు, కె.వి.వి.ప్రసాద్‌సింహాద్రి ఝాన్సీ, ఆళ్ల గోపాలకృష్ణ, కె.నరేంద్ర, చుండూరు రంగారావు, డాక్టర్‌ కొల్లా రాజమోహన్, కూర ప్రసాద్, డి.హరనాథ్, ప్రసాద్‌బాబు, ఎం.వీరబాబు, అక్కినేని భవానీప్రసాద్, ఎం.హరిబాబు, బి.శ్రీనివాసులు, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని