logo

మట్టి మాఫియాతోనే వైకాపా మట్టికొట్టుకుపోయింది

వైకాపా ప్రభుత్వ హయాంలో మట్టి, ఇసుక మాఫియాతో ఆ ప్రభుత్వం మట్టికొట్టుకుపోయిందని, కూటమిలోని ప్రతి నాయకుడు, కార్యకర్త శ్రమించడంతోనే తనకు అఖండ విజయం చేకూరిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

Published : 30 Jun 2024 05:20 IST

 

 మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ 

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో మట్టి, ఇసుక మాఫియాతో ఆ ప్రభుత్వం మట్టికొట్టుకుపోయిందని, కూటమిలోని ప్రతి నాయకుడు, కార్యకర్త శ్రమించడంతోనే తనకు అఖండ విజయం చేకూరిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. శనివారం తన స్వగృహంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కూటమి శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో జగనన్నకాలనీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, లేఔట్లకు మెరక పేరుతో మట్టి దోపీడీ జరిగిందన్నారు. 76 గ్రామ సచివాలయాలకు 29 మాత్రమే పూర్తికాగా.. రైతు భరోసా కేంద్రాల భవనాలు 41, ఆరోగ్య కేంద్రాలు 49కి గానూ 7 పూర్తయినట్లు చెప్పారు. నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియా లేకుండా చేయాలన్నదే తన ధ్యేయమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని