logo

న్యాయవాద వృత్తి కత్తిమీద సాములాంటిది

న్యాయ విద్య పూర్తి చేయడం సులభమే కానీ నిజజీవితంలో న్యాయవాది వృత్తి నిర్వహించడం కత్తిమీద సాములాంటిదని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ అన్నారు.

Published : 30 Jun 2024 05:19 IST

పట్టా అందిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్, ప్రిన్సిపల్‌ దివాకరబాబు 

కానూరు, న్యూస్‌టుడే: న్యాయ విద్య పూర్తి చేయడం సులభమే కానీ నిజజీవితంలో న్యాయవాది వృత్తి నిర్వహించడం కత్తిమీద సాములాంటిదని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ అన్నారు. శనివారం కానూరు వీడీ సిద్ధార్థ న్యాయ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ డేలో న్యాయ విద్యపూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం న్యాయవాదులకు నేర్పు, ఓర్పు అవసరమన్నారు. ప్రస్తుతం భారతదేశం డబ్ల్యూటీవోతో చేసుకున్న అగ్రిమెంటు ఆన్‌ సర్వీస్‌ ఒప్పందం ప్రకారం.. దేశంలోకి విదేశీ న్యాయవాదులు న్యాయవృత్తిలోకి ప్రవేశించడం అనివార్యమయ్యిందన్నారు. ఈ పోటీని తట్టుకోవాలంటే అందుకు తగిన నైపుణ్యాలతో పాటు, విషయ పరిజ్ఞానం 360 డిగ్రీల్లో ఉండాలన్నారు. ప్రిన్సిపల్‌ చెన్నుపాటి దివాకరబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని