logo

మోపిదేవి ఆలయ కానుకల లెక్కింపు

శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు.

Published : 29 Jun 2024 04:44 IST

పర్యవేక్షిస్తున్న అధికారులు 

మోపిదేవి, న్యూస్‌టుడే: శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆలయ సహాయ కమిషనర్‌(ఏసీ) నల్లం సూర్యచక్రధరరావు పాల్గొన్నారు. 90 రోజులకు రూ.84,23,387, బంగారం 64 గ్రాములు, వెండి 6.846 కిలోలు, అమెరికన్‌ డాలర్లు 541 ఆదాయంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి ఆలయాల్లో విధులు నిర్వహించే అధికారులతోపాటు తెనాలి, రేపల్లె, గుడివాడ, ఉయ్యూరు, చల్లపల్లి తదితర ప్రాంతాల నుంచి భక్తబృందాలకు చెందిన 270 మంది భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు. ఎస్‌ఐ వీరవెంకట సత్యనారాయణ, ఆలయ పర్యవేక్షకుడు సత్యనారాయణ, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని